విజయ్ బహిరంగ సభ.. తుపాకీతో చొరబాటుకు యత్నించిన వ్యక్తి

X
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీల ఎన్నికల్లో తన పార్టీ తమిళగ వెట్రి కళగం పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా విజయ్ నిర్వహించిన ఓ బహిరంగ సభలోకి ఓ వ్యక్తి తుపాకీతో వచ్చేందుకు యత్నించాడు. పుదుచ్చేరిలో నిర్వహించిన టివికె సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో సదరు వ్యక్తి వేదిక వైపునకు దూసుకొచ్చాడు. ఇది గమనించిన భద్రతా అయితే సిబ్బంది అతడిని నిలువరించి.. అదుపులోకి తీసుకున్నారు. గతంలో కరూర్‌లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 40 మందికిపైగా మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత విజయ్ చాలాకాలం తర్వాత విజయ్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
