అదిరిపోయే మాస్ డ్యాన్స్ సాంగ్

Mana Shankara Vara Prasad Garu
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చా ర్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల 72 మిలియన్లకు పై గా వ్యూస్ ని సంపాదించి ఇప్పటికే ఈ చిత్రం భారీ అం చనాలను సృష్టించింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ ని విశేషంగా అలరించనుంది. హైదరాబాద్ లో వేసిన భా రీ సెట్‌లో చిరంజీవి, వెంకటేష్ లపై స్టైలిష్ డ్యాన్స్ సాం గ్ షూటింగ్ ని మేకర్స్ ప్రారంభించారు. తొలిసారిగా, చిరంజీ వి, వెంకటేష్ ఒక ఉత్సాహభరితమైన, గ్రాండ్ సెలబ్రేషన్ నంబర్ లో కలిసి అలరిస్తున్నా రు.ఈ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలి యో అద్భుతమైన బీట్స్‌తో పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్ ని కంపోజ్ చేశా రు.
ఈ పాటలో 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నా రు. ఈ పాటలో సెట్ ని కలర్, రిథమ్, వైబ్ ల కార్నివాల్ గా మార్చారు. ఇద్దరు స్టార్‌ల కెమి స్ట్రీ, ఎనర్జీ ప్రేక్షకులని అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయనుంది. చిరంజీవి, వెం కటేష్ కలసి అదరగొట్టబోతున్న ఈ సాంగ్ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫీస్ట్ కానుంది. త్వరలోనే చిరంజీవి నయనతారలపై చిత్రీకరించిన ఒక మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు.
-
Home
-
Menu
