గద్వాల్ లో బోల్తాపడిన విహారయాత్ర బస్సు.... విద్యార్థులకు గాయాలు

Manavapadu Jogulamba Gadwal
X

Manavapadu Jogulamba Gadwal

అలంపూర్‌: జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోరవెల్లి శివారులో సోమవారం ఉదయం బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. తమిళనాడులోని సేలం ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన 37 మంది విద్యార్థులు హైదరాబాద్‌ కు విహారయాత్రకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, హైవే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను అలంపూర్‌ చౌరస్తాలోని 100 పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Tags

Next Story