కుమారుడి గొంతు కోసి.. తండ్రి ఆత్మహత్య

కుమారుడి గొంతు కోసి.. తండ్రి ఆత్మహత్య
X

మంచిర్యాల: ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తండ్రి తన కుమారుడి గొంతు కోసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... రాంపూర్ గ్రామంలో చిన్నభూమయ్య అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతూ తన భార్య స్వరూప ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి చిన్నభూమయ్య కాలేయ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్సకు అధిక మొత్తంలో ఖర్చు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుటుంబం అప్పులు పాలు కావడంతో ఏం చేయాలో తోచలేదు. కుమారుడు కార్తీక్ కూడా వైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఫెన్షన్ దరఖాస్తు చేసిన కూడా మంజూరు కాకపోవడంతో పాటు తాను దరఖాస్తు చేసుకున్న సిఎం రిలీఫ్ ఫండ్ కూడా రాలేదు. కానీ ఆ డబ్బులు కూడా రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు అరిగోస పెడుతున్నాయి. ఇంట్లో ఎవరు లేని సమయంలో కుమారుడి గొంతు కోసి తండ్రి గొంతు కోసుకొని చనిపోయాడు. ఇంట్లోకి భార్య, కూతుళ్లు వచ్చేసరికి భర్త, కుమారుడు రక్తపు మడుగులో కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

Tags

Next Story