చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 18కి చేరిన మృతులు

చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 18కి చేరిన మృతులు
X

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, బైరాంగడ్ - నైమేడ్ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజి సుందర్ రాజ్, బీజాపూర్ జిల్లా ఎస్‌పి డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ ధ్రువీకరించారు. గురువారం బీజాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మృతి చెందిన 18 మందిలో 16 మృతదేహాలను గుర్తించగా మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో పిఎల్‌జిఏ కంపెనీ ఇన్‌ఛార్జి, వెల్లా మొరియం, సిఐపిసి కంపెనీ 3 డివిసిఎం సన్ను అవడం, పిపిసిఎం నందా మీడియం, లాలు అలియాస్ సీతారాం, రాజు, కామేష్, కవాసి లక్ష్మి, తాతి బండి, సఖి లేకం, సోమిడీ కొంచెం, దళ సభ్యుడు చందు, కోసం, శాంతి, సోని, మాద్వి సంగీత, పద్దం నన్ను లుగసను గుర్తించామని వెల్లడించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుండి ఎఎంజి ఒకటి, నాలుగు ఏకే 47, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌లు, నాలుగు ఇన్ సాస్, రెండు 303 రైఫిల్స్, నాలుగు సింగిల్ షాట్ రైఫిల్స్, రెండు బిజిఎల్ లాంచర్స్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, మావోయిస్టు సామగ్రి, కరపత్రాలను స్వాధీనపరుచుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎస్‌పి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. 2025 సంవత్సరంలో జిల్లా లో జరిగిన వివిధ ఎదురుకాల్పుల సంఘటనల్లో 161 మావోయిస్టలు మృతి చెందగా 546 మందిని అరెస్ట్ చేశామని, 560 మంది లొంగిపోయారని అన్నారు.

Tags

Next Story