జహీరాబాద్‌లో వివాహిత అదృశ్యం

జహీరాబాద్‌లో వివాహిత అదృశ్యం
X

జహీరాబాద్ పట్టణంలోని కాంత రెడ్డి కాలనీకి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి జహీరాబాద్ టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె. వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కాంత రెడ్డి కాలనీలో నివసించే మొహమ్మద్ ముస్తఫా (26), స్థానిక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య ఆసియా (19) గురువారం (ఫిబ్రవరి 20) రాత్రి అదృశ్యమయ్యారు.ఆ రోజు రాత్రి 10:00 గంటలకు దంపతులిద్దరూ నిద్రపోయారు. అయితే, అర్ధరాత్రి 12:00 గంటల సమయంలో ముస్తఫా నిద్రలేచి చూడగా, భార్య ఇంట్లో కనిపించలేదు. వెంటనే కంగారుపడిన ఆయన బంధువులు, స్నేహితులు మరియు తెలిసిన వారి వద్ద అన్ని చోట్లా వెతికినప్పటికీ ఆసియా ఆచూకీ లభించలేదు. దీంతో ముస్తఫా జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్ కె. వినయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


మరో ఘటనలో...

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా తన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం.. కోహిర్ మండల్ సజ్జపూర్ గ్రామానికి చెందిన మేతర సామెల్ కుమారుడైన మేతర రాజు (35) అనే వ్యక్తి తన భార్య రాణమ్మతో గత కొంతకాలంగా కుటుంబం విషయంలో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 05/02/2026 తేదీన భార్యతో మరోసారి గొడవపడి, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. రాజు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరియు తెలిసిన వారందరి వద్ద గాలించారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో, శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాజు ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని కోహిర్ ఎస్ ఐ నరేష్ కోరారు.

Tags

Next Story