10లక్షల గ్రీన్ వాహనాల విక్రయమే లక్ష్యం: మారుతి సుజుకీ

10లక్షల గ్రీన్ వాహనాల విక్రయమే లక్ష్యం: మారుతి సుజుకీ
X

న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల గ్రీన్ వాహనాలను విక్రయించాలని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐఎల్) లక్ష్యంగా పెట్టుకుంది. సీఎన్‌జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను ఇందులో భాగంగా పరిగణిస్తోంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, సీఎన్‌జీ వాహనాల్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ప్రవేశపెట్టడం వంటి పరిణామాలు ఈ లక్ష్య సాధనకు దోహదపడతాయని కంపెనీ భావిస్తోంది.

‘ఆటో గ్రీన్ మిషన్’లో భాగంగా మారుతీ సుజుకీ శుక్రవారం స్విఫ్ట్, డిజైర్, బాలెనో మోడళ్లలో ఆటోమేటిక్ ఎస్-సీఎన్‌జీ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సీఎన్‌జీ విభాగంలో సుమారు 70 శాతం మార్కెట్ వాటా కలిగిన మారుతీ సుజుకీ.. ఈ ఏడాది 8-9 లక్షల గ్రీన్ వాహనాలను విక్రయించవచ్చని తొలుత అంచనా వేసింది. అయితే కొత్త ఆటోమేటిక్ సీఎన్‌జీ మోడళ్లను ప్రవేశపెట్టడంతో లక్ష్యాన్ని 10 లక్షలకు పెంచినట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు.

Tags

Next Story