స్మిత సూపర్‌హిట్ సాంగ్.. మరోసారి సరికొత్తగా..

X
తెలుగు పాప్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గాయని స్మిత. ఆమె ఎన్నో పాటలు పాడినప్పటికీ.. ‘మసక మసక చీకటి’లో పాటకు ఉన్న క్రేజ్ వేరు. దేవుడు చేసిన మనుషులు (1973) సినిమా నుంచి పాటను తీసుకొని దాన్ని రీమిక్స్ చేసి విడుదల చేశారు స్మిత. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. అయితే ఇప్పుడు ఆ పాటని మరింత కొత్తగా రీమిక్స్ చేసి విడుదల చేశారు. ఈ తరం శ్రోతలకు నచ్చే విధంగా పాటకి ర్యాప్‌ని జత చేశారు. ఈ ర్యాప్‌ని ప్రముఖ సింగర్ నోమల్ పాడారు. ప్రస్తుతం ఈ పాట యువతకు తెగ నచ్చుతోంది. మీరూ ఆ పాటని చూసి ఎంజాయ్ చేయండి..
Next Story
-
Home
-
Menu
