కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం... 32 షాపులు దగ్ధం

Massive fire breaks out in Kondagattu
X

Massive fire breaks out in Kondagattu

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద శనివారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక అభయ హనుమాన్ విగ్రహం సమీపంలో బొమ్మల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటల చెలరేగడంతో 32 దుకాణాలు అగ్నికి అహుతిగా మారాయి. భారీగా అస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బొమ్మలు ఉన్నాయని నిర్వహకులు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఉండడంతో పెద్ద మొత్తంలో బొమ్మలు తయారు చేయడంతో దిగుమతి చేసుకున్నామని వ్యాపారులు చెబుతున్నారు. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు. మల్యాల, ధర్మపురి సిఐలు రవి, రాంనర్సింహ్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని స్థలాన్ని పరిశీలించారు. షార్ట్ సర్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story