శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ సీజ్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం మధ్యాహ్నం భారీగా హైడ్రోపోనిక్ (గాంజా) మత్తు పదార్థాలను డీఆర్‌ఐ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేసిన అధికారులు.. వారినుంచి 9.5 కోట్లు విలువ చేసే27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌నుండి తాయ్ ఎయిర్ లైన్స్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన నలుగురు ప్రయాణికులు.. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బయటకు రావడమేకాకుండా.. అక్రమంగా తెచ్చిన మత్తుపదార్థాలను రిసీవర్‌లకు అందిస్తూ దొరికిపోయారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా రిసీవర్‌లను పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.. హైడ్రోపోనిక్‌ను అక్రమంగా తెచ్చిన నలుగురిని, రిసీవర్లు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. డీఆర్‌ఐ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
-
Home
-
Menu
