కల్వకుర్తి లో భారీ చోరీ

కల్వకుర్తి లో భారీ చోరీ
X

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విద్యా నగర్, కేశవ్ నగర్ కాలనిలో గల శ్రీనివాస్ శర్మ నివాసంలో సోమవారం భారీ చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్ శర్మ, అతని కుటుంబ సభ్యులు నవంబర్ 30న వేరే ఊరికి వెళ్ళి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం విరిగిపడి ఇంట్లో సామాన్లు చిందర వందరగా పడి ఉండడం ,బీరువాలు తెరిచి ఉన్నాయి. ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని గమనించిన శ్రీనివాస్ శర్మ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి ఎస్సై మాధవరెడ్డి తన సిబ్బందితో చేరుకుని ఇళ్ళంతా పరిశీలించారు. బాధితుడు 40 తులాల బంగారు, 6 లక్షల నగదు చోరీకి గురైందని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు.

Tags

Next Story