ఎంబిబిఎస్ విద్యార్థి గడ్డాన్ని ట్రిమ్మర్‌తో కత్తిరించి... వేధింపులు

X
సిద్దిపేట: ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సీనియర్లు వేధించిన సంఘటన సిద్దిపేట జిల్లా సమీపంలో మిట్టపల్లిలోని సురభి వైద్య కాలేజీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయి కృష్ణ అనే విద్యార్థి ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం సురభి మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. ఈ నెల 17న కాలేజీలో వైట్ కోట్ వేడుక జరిగింది. నలుగురు సీనియర్ విద్యార్థులు సాయికృష్ణ అడ్డగించి అతడి గడ్డాన్ని ట్రిమ్మర్‌తో కట్ చేశారు. కాళ్లను వి ఆకృతి ఉంచి నిలబెట్టి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. నీళ్లు తీసుకరావాలని ఆర్డర్లు వేశారు. ర్యాగింగ్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కాలేజీ పిఆర్‌ఒ తెలిపారు.
Next Story
-
Home
-
Menu
