మియాపూర్ లో మహిళపై కత్తితో దాడి

హైదరాబాద్: తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మియాపూర్ లో జరిగింది. నూకరత్నం అనే మహిళపై కత్తితో ఆలీషా అలియాస్ పాండు దాడి చేశాడు. కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్ లో హౌస్ కీపింగ్ పనిచేస్తుంది. గతంలోనే భర్తను కోల్పోయిన నూకరత్నం అనే మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రసాద్ అనే వ్యక్తిని నూకరత్నం గతనెల 20న పెళ్లి చేసుకుంది. నూకరత్నం పనిచేసే చోట ఆలీషా అలియాస్ పాండు వంటమనిషిగా పనిచేస్తున్నాడు. తనకు చెప్పకుండా ప్రసాద్ ను పెళ్లి చేసుకోవడంతో అలీషా ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 19న తండ్రి లాలూ, స్నేహితుడు జాన్ తో కలిసి మహిళ ఇంటికి అలీషా వెళ్లాడు. తనవెంట రావాలని మహిళతో అలీషా గొడవపడ్డాడు. నూకరత్నం నిరాకరించడంతో ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. నూకరత్నం తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నిందితులు అలీషా, అతని తండ్రి లాలూను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
Home
-
Menu
