ఉప్పల్ లో బాలికపై లైంగిక దాడి?

ఉప్పల్ లో బాలికపై లైంగిక దాడి?
X

తల్లి సహా ముగ్గురిపై ఉప్పల్ పీఎస్ లో పోక్సో కేసు

బెదిరించి పలుమార్లు దాడి చేశారంటూ ఫిర్యాదు..

గర్భం దాల్చిన బాలికకు ఆస్పత్రిలో చికిత్స.. ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

మన తెలంగాణ/ఉప్పల్: బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఉప్పల్ లో కలకలం రేపింది. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు ఆమె తల్లితో పాటు మరో ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ కుటుంబం కొంతకాలంగా ఉప్పల్‌లోని ఓ కాలనీలో నివాసం ఉంటోంది. బాలిక తల్లికి మేడిపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం సన్నిహిత సంబంధంగా మారినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో సదరు వ్యక్తి తరచూ ఇంటికి వచ్చేవాడని, ఈ క్రమంలో బాలికపై కన్ను పడింది. అంతటితో ఆగకుండా ఆమెను లొంగదీసుకుని బలవంతంగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో తన తల్లితో పాటు మరో బంధువు కూడా సహకరించారని బాలిక ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తల్లి, సదరు వ్యక్తి, మరో బంధువుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక వాంగ్మూలం, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఉప్పల్ పోలీసులు తెలిపారు.

Tags

Next Story