మేడిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి.... వీడియో వైరల్

మన తెలంగాణ/ బోడుప్పల్ : కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....గోదావరిఖని చెందిన మర్రి ప్రశాంత్(35),శ్రావణి (33),కుమారుడు సహస్రన్ (10)తో కలిసి హైదరాబాద్ లోని రాంనగర్ లో నివసిస్తున్నారు.మర్రి ప్రశాంత్ మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మేడిపల్లిలోని చుట్టాల ఇంటికి వస్తుండగా స్పార్క్ హాస్పిటల్ దగ్గరలో వెనుక నుండి వచ్చిన కారు కియా సోనెట్ (టిఎస్08హెచ్ హెచ్ 6363) అదుపుతప్పి వీరు ప్రయాణిస్తున్న బైకును ఢీకొనడంతో మర్రి ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య శ్రావణి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది.వారి కుమారుడు ప్రమాదం నుండి బయటపడ్డాడు. కారు నడిపిన వ్యక్తి రామయ్య సర్వే ఆఫ్ ఇండియా సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం దంపతులు పెళ్ళి రోజు వేడుకలు కూడా చేసుకున్నారు.
-
Home
-
Menu
