మెడికో విద్యార్థిని బలవన్మరణం

మెడికో విద్యార్థినీ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని సురభి వైద్య కళాశాలలో చోటు చేసుకుంది. సిద్దిపేట త్రీ టౌన్ సిఐ టి.లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌బాద్‌కు చెందిన ఈద శ్రీజ (20)కు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామలే ఉన్నత చదువులు చదివించడానికి 2024లో ఎంసెట్ ఎంట్రెన్స్ ద్వారా సురభి వైద్య కళాశాలలో ఫిజియోథెరపీలో ప్రవేశం పొందింది. సురభి వైద్య కళాశాలలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న
శ్రీజ గత మూడు రోజుల క్రితం పెద్దపల్లికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి మేనమామకు ఫోన్ చేసి మీ కోడలు, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించుకున్నామని, కానీ ఆమె వేరే ఎవరితో మాట్లాడుతుందని చెప్పినట్లు తెలిపారు. ఆదివారం శ్రీజ సురభి మెడికల్ కళాశాల బాలికల హాస్టల్లో గల రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయిందని సురభి యాజమాన్యం సమాచారం అందించినట్లు తెలిపారు. కోడలు శ్రీజ మృతి పట్ల పెద్దపల్లికి చెందిన శ్రీధర్‌పై అనుమానం ఉన్నట్లు శ్రీజ మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
-
Home
-
Menu
