కత్తికి తగ్గిన పదును.... దూరంగా వెళ్లిపోతున్న వైద్యులు

కత్తికి తగ్గిన పదును.... దూరంగా వెళ్లిపోతున్న వైద్యులు
X

ఇటీవల కాలంలో మెడికల్ విద్యార్థులు సర్జరీ విభాగంలో పనిచేయడానికి ఉత్సాహం చూపించడం లేదు. ఈ నెలలో జరిగిన నీట్ 2025 పరీక్షల కౌన్సిలింగ్ లో అత్యధిక మంది విద్యార్థులు జనరల్ మెడిసిన్ మరియు రేడియాలజీని తీసుకున్నారు. ఢిల్లీలో టాప్ 1,500 మంది అభ్యర్థులలో, 632 మంది విద్యార్థులు (42%) MD జనరల్ మెడిసిన్‌ను ఎంచుకున్నారు, ఇది అనేక మెడికల్ సూపర్‌స్పెషాలిటీలకు ప్రవేశ ద్వారంగా దాని స్థానాన్ని మనకు తెలియచేస్తుంది. రేడియోడయాగ్నసిస్‌ను నిశితంగా అనుసరించారు, 447 మంది అభ్యర్థులు ఎండి రేడియాలజీ (30%) తీసుకున్నారు, ఇది మరింత నిర్మాణాత్మక గంటలు, తక్కువ అత్యవసర పరిస్థితులను అందించే రంగంగా ఉంది. దీనికి విరుద్ధంగా, 99 మంది విద్యార్థులు (6.6%) మాత్రమే ఎంఎస్ జనరల్ సర్జరీని ఎంచుకున్నారు, ఇది అధిక-రిస్క్ అయినా ఆపరేషన్ల విభాగాన్ని విధానపరమైన విభాగాల పట్ల విముఖతను హైలైట్ చేస్తుంది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఆ కాలంలో ఎక్కువమంది సర్జరీ తీసుకునేవారు ఆర్థోపెడిక్స్ తీసుకునేవారు.

చాలామంది సర్జరీ తీసుకుంటే మెడికల్ విషయాలలో తలనొప్పి అని భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ చిన్న ఆపరేషన్ చేసినా కానీ ఎప్పుడైనా కాంప్లికేషన్ రావచ్చు దీనివలన డాక్టర్లపై దాడులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా కోర్టులలో వాజ్యాలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి డాక్టర్లు దోచుకుంటా అన్నారు అని అనడం, దాడి చేయడం ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీలు పరీక్షలు ఐసియు ఛార్జీలు ఎక్కువ అయ్యి వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయింది. ఈ విషయం మన ప్రజలకు అర్థం కాకపోవడం వలన ఆపరేషన్లు ఫెయిల్యూర్ అయితే డబ్బులు ఖర్చయిపోయినాయి అని బాధపడి దాడులు చేస్తున్నారు. ఇది ఒక ముఖ్య కారణంగా విద్యార్థులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ కాలం శ్రమించి ఆపరేషన్లు నేర్చుకోవాలి, వాళ్లకు వచ్చే డబ్బులు కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందువలన ఎందుకొచ్చిన తలకాయ నొప్పి అని ఆ బ్రాంచ్ ను తీసుకోవడం తగ్గించేసారు.

శస్త్రచికిత్స వృత్తిలో స్థిరపడటానికి తరచుగా న్యూరోసర్జరీ, కార్డియాక్ సర్జరీ, యూరాలజీ లేదా పీడియాట్రిక్ సర్జరీ వంటి రంగాలలో మరింత సూపర్ స్పెషలైజేషన్ అవసరం, అలా చేయగలిగితేనే స్థిరత్వానికి మార్గాన్ని పొడిగిస్తుంది. దీనికి మరలా మూడు సంవత్సరాల ఎం సి హెచ్ చేయవలసి ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు మూడేళ్ల చదువు తమ ఎండి చేయడంలో కొనసాగించి ఎంబిబిఎస్ తో కలుపుకుంటే 9 ఏండ్లు అప్పటికే చదివి వింటారు.. ఇంకా మూడేళ్లు అనగా 12 ఏళ్లు చదవవలసి వస్తుంది. దాని తర్వాత ఆపరేషన్లలో సూపర్ స్పెషాలిటీలో నైపుణ్యం సంపాదించాలి అంటే మరో ఐదేళ్ల కాలం పడుతుంది. దీనికి ఈ కాలం విద్యార్థులు సిద్ధంగా లేరు...

ఇందుకు కారణం చాలా లోతుగా ఉంది. ఈ సర్జరీ విభాగాలలో చేరితే ఎక్కువ పని గంటలు చేయాల్సి రావడం, ఎక్కువ అంకితభావంతో పనిచేయాల్సి రావడము, అధికమైన భావోద్వేగ పరిస్థితులలో పని చేయాల్సి రావటము వలన అత్యధికమైన మోటివేషన్ లేకుంటే బర్నౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ కాలేజీలలో విద్యను అభ్యసించి ఎక్కువ ఫీజులు చెల్లించి మెడిసిన్ చదివిన ఈ కాలపు యువతకు అంత కష్టపడాల్సిన అవసరం ఉందా? అని భావిస్తున్నారు.. అందుకనే ఎక్కువ ప్రమాదం లేని రేడియాలజీ జనరల్ మెడిసిన్ లాంటి విభాగాలను ఎంచుకుంటున్నారు..

ఈ విధంగా తక్కువ రిస్క్ గల బ్రాంచ్ల వైపు విద్యార్థులు మారడాన్ని ఫ్యూచర్లో మనకు సర్జన్ల కొరత ఎక్కువ అయిపోయి కీలకమైన ఆపరేషన్లు చేసే సర్జన్లు తక్కువగా అయిపోయి ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇక సూపర్ స్పెషాలిటీ లైన గుండె ఆపరేషన్ల విభాగము ఎంసిహెచ్ సిటివిఎస్ న్యూరో సర్జరీ విభాగాలలో తీసుకునే వాళ్ళు విదేశాల్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ట్రెండ్ ఇప్పటికే అన్ని దేశాలలో కొనసాగుతూ ఉంది.

ఇప్పుడు భారతీయ యువత కూడా చాలెంజింగా ఉండి ఎక్కువ రిస్క్ తో కూడిన ఆపరేషన్ చేసే వైపునుండి స్థిరత్వంగా ఆదాయం ఉండి తక్కువ పని గంటలు తక్కువ రిస్కు ఉండే రేడియాలజీ మెడిసిన్ లాంటి వైపుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందువలన కత్తికి పదును తగ్గి కత్తికి దూరంగా వెళ్లిపోతున్నారు. ఈ మార్పు మంచిదేనా సమాజానికి అనేది మనం గమనించాలి.. సమాజం పోకడల వలన విద్యార్థులు మారారా లేక విద్యార్థులలో రిస్కు తీసుకొని చాలెంజింగా వృత్తిని నిర్వహించాలి అనే స్పృహ తగ్గిందా? మీరు ఏమంటారు?





డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

Next Story