లండన్ లో గుండెపోటుతో తెలంగాణ యువకుడు మృతి

X
మేడిపల్లి: తెలంగాణకు చెందిన యువకుడు లండన్‌లో గుండెపోటుతో చనిపోయాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన రమేశ్ రెడ్డి కుమారుడు ఏనుగు మహేందర్ రెడ్డి రెండు సంవత్సరాల క్రితం పిజి చేసేందుకు లండన్‌కు వెళ్లాడు. పిజి పూర్తి చేసిన అనంతరం సదరు విద్యార్థికి వర్క్ వీసా కూడా వచ్చింది. రూమ్ లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహేందర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షుడిగా రమేశ్ రెడ్డి పని చేస్తున్నారు. యువకుడి మృతిపట్ల వేములవాడ ఎంఎల్ ఆది శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్థులు సంతాపం తెలిపారు. దమ్మన్నపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Tags
Next Story
-
Home
-
Menu
