మేడిపల్లిలో ఫ్లైఓవర్ పిల్లర్ ను ఢీకొట్టిన కారు: ఇద్దరు విద్యార్థులు మృతి

Medipalli Medchal Malkajgiri District
మేడిపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ పిల్లర్ ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ టూ వరంగల్ జాతీయ రహదారిలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు అతి వేగంగా ప్రయాణిస్తూ ఫ్లై ఓవర్ పిల్లర్ 97ను బలంగా ఢీకొట్టింది. ఇద్దరు ఘటనా స్థలంలో మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమం ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు కారులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులు సాయి వరుణ్, నిఖిల్ అనే ఇద్దరు విద్యార్థులుగా గుర్తించారు. వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే ముగ్గురు విద్యార్ధులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
