మేడిపల్లిలో ప్రియరాలుతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్న ప్రియుడు

Medipally Police Station Medchal Malkajgiri
మేడిపల్లి: ఓ పాత నేరస్థుడు తన ప్రియురాలుతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ సంఘటన మేడ్కల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బోడుప్పల్ ప్రాంతం సాయిరాంనగర్‌లో గురువారం రాత్రి ఇంటి ముందు పెట్టిన బైక్ కనిపించకపోవడంతో సిసి కెమెరాలను పరిశీలించారు. అదే రోజు తెల్లవారుజామున 3.39 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి మహిళ బైక్ పట్టుకుంటూ వెళ్తున్నట్టు సిసి కెమెరాలో రికార్డయ్యింది. అదే ఇంట్లో ఉంటున్న ప్రవీణ్ కుమార్ కూడా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లాడు. అతని ఇంట్లో కూడా తులం బంగారం, రూ.60 వేల నగదుతో పాటు శ్రీకాంత్ బైక్‌ను దొంగ సుధాకర్ తన ప్రియురాలుతో కలిసి అపహరించాడు. ప్రియురాలితో కలిసి అతడికి దొంగతనం చేసే అలవాటు ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను అతి త్వరలో పట్టుకుంటామని తెలియజేశారు.
-
Home
-
Menu
