నెల రోజుల్లో కుమారుడి ఫస్ట్ బర్త్ డే... ఎంత పని చేశావ్ తల్లి

నెల రోజుల్లో కుమారుడి ఫస్ట్ బర్త్ డే... ఎంత పని చేశావ్ తల్లి
X

హైదరాబాద్: తల్లి తన 11 నెలల కుమారుడిని విషమిచ్చి చంపి అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే మృతురాలి తల్లి కూడా విషం తాగి ఆత్మాయత్నం చేసుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా మల్లెపల్లి మండలం పాల్వాయి చెందిన యశ్వంత్ రెడ్డి, సుష్మిత అనే దంపతులు హస్తినాపురంలోని జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు. యశ్వంత్ రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుష్మిత తండ్రి చనిపోవడంతో తల్లి లలిత కూడా అల్లుడు ఇంట్లోనే ఉంటుంది. గత సంవత్సరం ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. వచ్చే నెలలో పుట్టిన రోజు వేడుకలు ఉండడంతో షాపింగ్ చేశారు దంపతులు. శుక్రవారం దంపతుల మధ్య గొడవ జరిగిన అనంతరం యశ్వంత్ తన ఆఫీస్‌కు వెళ్లిపోయాడు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చేసరికి లొపలి వైపున గడియపెట్టి ఉండడంతో పలుమార్లు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసుల సహాయంలో కిటికీ తొలిగించి లోపలికి వెళ్లి చూశారు. ఫ్యాన్‌కు ఉరేసుకొని భార్య చనిపోగా, మంచంపై కుమారుడు, అత్త కొన ఊపిరితో ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మీర్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story