హుజూర్‌నగర్‌లో 25న మెగా జాబ్‌మేళా

హుజూర్‌నగర్‌లో 25న మెగా జాబ్‌మేళా
X

గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత కోసం ఈ నెల 25న హుజూర్‌నగర్‌లో నిర్వహించే మెగా జాబ్‌మేళాకు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గ్రామ పాలనాధికారులు, గ్రామ పోలీసు అధికారులు సూచించారు. సమాజంలో అతిపెద్ద సమస్యగా మారిన నిరుద్యోగ సమస్యను తమవంతుగా కొంతవరకైనా తీర్చాలన్న ఉద్దేశంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు కల్పించే నిమిత్తం హుజూర్‌నగర్‌లో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం నుం డి ఆర్‌డిఒలు, తహశీల్దార్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎంపిడిఒలు, గ్రామ పాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పోలీసు అధికారులతో జాబ్‌మేళాపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నప్పటికీ ఉద్యోగావకాశాలు సరిగా లేకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు సరి గా రావడం లేదని అన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని తమ వంతు ప్రయత్నంగా కొంతవరకైనా నిరుద్యోగ సమస్యను తీర్చాలన్న ఉద్దేశం తో సింగరేణి కాలరీస్,

డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ సంయుక్త సహకారంతో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.250 వరకు కంపెనీలు ఈ మెగా జాబ్‌మేళాలో పాల్గొననున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి వెళ్లి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఆయా కంపెనీలు హుజూర్‌నగర్‌కు వస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 5 కాపీల రెజ్యూ మ్ తో పాటు రెండు పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలను తీసుకుని జాబ్‌మేళాకు రావాలని సూచించారు. జాబ్‌మేళా నిర్వహించే పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో హెల్ప్‌డెస్క్‌లు, రిజిస్ట్రేషన్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాబ్‌మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు స్వర్ణ వేదిక ఫంక్షన్ హాలులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజ నం, సాయంత్రం టిఫిన్ కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, జిల్లా ఎస్‌పి నరసింహ, డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఒఎస్‌డి ప్రవీణ్, అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ప్రజా ప్రతినిధులు సర్వోత్తంరెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, చింతల లక్ష్మీనారాయణరెడ్డి, చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story