పోలీసులమని చెప్పి బాలికపై అత్యాచారం

ఢిల్లీ: పోలీసులమని చెప్పి బాలికపై అత్యాచారం చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 16 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో(17) కలిసి కలకజి మందిర్‌కు వచ్చింది. అనంతరం స్నేహితుడితో కలిసి దగ్గరలోని పార్కుకు వెళ్లింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికి చేరుకొని పోలీసులమని చెప్పారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒకరు తన స్నేహితుడిని పట్టుకున్నారని, మరో ఇద్దరు తనపై అత్యాచారం చేశారని బాలిక ఆరోపణలు చేసింది. దీంతో బాలిక స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నార్త్ ఢిల్లీలో నాలుగు రోజుల క్రితం బాలికపై గ్యాంగ్ రేప్ చేయడంతో కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం ఢిల్లీలోని కశ్మీర్ గేట్ సమీపంలో కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం చేసిన విషయం విధితమే.
Tags
-
Home
-
Menu
