కారుణ్య మరణం అనే మెర్సి కిల్లింగ్

భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ లేక కారుణ్య మరణం అనేది చట్టం ప్రకారం నేరం. కేవలం కోర్టులు మాత్రమే దానికి అనుమతించాలి. అప్పుడే డాక్టర్లు ఆ పేషెంట్ కు మరణాన్ని నిర్ధారించవచ్చు. పేషెంట్ మరణశయ్య పై ఉన్నాడని లేక వైద్యానికి రెస్పాండ్ కాలేదనో, కోమాలో ఉన్నాడనో వైద్యాన్ని ఆపేసే హక్కు వైద్యులకు లేదు. పాసివ్ యూధనేషియా అంటే కారుణ్య మరణం ప్రసాదించాలి అంటే కేవలం కోర్టులు మాత్రమే జోక్యం చేసుకొని ప్రసాదించాలి.
గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో అవిభాజ్యంగా ఉంటుంది అనేది కోర్టు తీసుకున్న నిర్ణయం. ఇది చాలా దేశాలలో ఉన్నప్పటికీ మన భారత దేశంలో మొట్టమొదటిసారిగా దీనిని అమలు చేశారు. ప్రజలు కానీ డాక్టర్లు గాని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మెర్సి కిల్లింగ్ అనేది కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలి. వైద్యులు ఇక పేషెంట్ ఏమాత్రం వైద్యానికి రెస్పాండ్ కాడు అతను జీవచ్ఛవమే అతను బ్రతికినప్పటికీ అతనికి ఎటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అని మాత్రమే సర్టిఫై చేయాల్సి ఉంటుంది. తరువాత వారికి మరణాన్ని ప్రసాదించాలి అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. ఇది మేము మెడికల్ ఎథిక్స్ లో ఒక భాగంగా చెబుతూ ఉంటాం. హరీష్ అనే యువకుడు 2013లో ఛండీగఢ్‌లోని భవనం పైనుంచి కిందపడిపోయాడు. హరీష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి పోయాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 13 ఏళ్ల నరకం తరువాత సుప్రీం కోర్టు తీర్పుతో అతడికి విముక్తి లభించింది. కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో లైఫ్ సపోర్ట్‌ను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తొలగించనున్నారు. సుప్రీం కోర్టు దేశ చరిత్రలో తొలి సారి ఇలాంటి తీర్పు ఇచ్చి సంచలనం సృష్టించింది.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Tags
-
Home
-
Menu
