నీట మునిగిన ఎంజిబిఎస్ బస్టాండ్

హైదరాబాద్: మూసీ నది పొంగి ప్రవహిస్తుండడంతో ఎంజిబిఎస్ బస్టాండ్ నీటిలో మునిగిపోయింది. ఎంజిబిఎస్ బస్టాండ్ లో నీళ్లు మోకాల్లోతు రావడంతో రాకపోకలను నిలిపివేశారు. బస్టాండు లోపల నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రయాణికులు బస్టాండ్ లోపల చిక్కు కపోయారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బయటికి రాలేక లోపల ప్రయాణికులు ఉండిపోయారు. బస్టాండ్ లోపల చిక్కుకున్న ప్రయాణికులు తీసుకొని వచ్చేందుకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులు ఒక్కొక్కరుగా చేతులు పట్టుకొని బయటికి వస్తున్నారు. ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగిన వరద తీవ్రత పెరిగింది. ముందస్తు హెచ్చరిక లేకుండా గండి పేట గేట్లు ఎత్తడంతో వరద బీభత్సం సృష్టించింది. మున్సిపల్, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. మూసీ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవాహిస్తుండడంతో పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంజిబిఎస్ బస్టాండ్ ఇరువైపుల ఉన్న రోడ్లను మూసివేశారు.
-
Home
-
Menu