భారత్‌లో మైక్రోసాఫ్ట్ బి.డాలర్ల పెట్టుబడులు

భారత్‌లో మైక్రోసాఫ్ట్  బి.డాలర్ల పెట్టుబడులు
X

న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ చైర్మన్, సిఇఒ సత్య నాదెళ్ల మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అనంతరం భారత్‌కు 17.5 బిలియన్ డాలర్ల (రూ.1.58 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఆసియాలో ఇప్పటివరకు చేసిన అతిపెద్ద పెట్టుబడిగా ఇది గుర్తిం పు పొందింది. భారతదేశం ఎఐ ఆధారిత భవిష్యత్తు దిశగా ముందుకెళ్లేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం నాదెళ్ల సోషల్ మీడియా లో ధన్యవాదాలు తెలుపుతూ ఈ పెట్టుబడిని అ ధికారికంగా ప్రకటించారు. 2026 నుండి 2029 వరకు నాలుగు సంవత్సరాల కాలంలో ఈ నిధులు క్లౌడ్, కృత్రిమ మేధస్సు రంగాల్లో వి నియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ పెట్టుబడి విస్తరణ, నైపుణ్యాభివృద్ధి, సార్వభౌమ సాంకేతిక సామర్థ్యాలు వంటి మూడు ప్రధాన కేంద్రీకరణ రంగాలపై దృష్టి పెడుతుం ది. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఇండియా సౌత్ సెంట్రల్ క్లౌడ్ రీజియన్ 2026 మధ్య నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇది దేశంలోనే అతి పెద్ద హైపర్‌స్కేల్ డేటాసెంటర్ ప్రాం తంగా ఉండనుంది. అదనంగా చెన్నై, హైదరాబాద్, పుణెలలోని మూడు ప్రస్తు త డేటా సెంటర్ ప్రాంతాలూ విస్తరించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల పని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎఐ అభివృద్ధికి దోహదపడుతోందని సంస్థ వెల్లడించింది.

Tags

Next Story