సోయాకు మద్దతు ధర కోసం రైతుల తిప్పలు

Minimum Support Price (MSP)
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర పొందాలంటే రైతులకు రాత్రింబవళ్లు కష్టపడక తప్పట్లేదు. నిర్మల్ జిల్లా, కుభీర్ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో సోయా కొనుగోలు చేపట్టనుంది. శనివారం కొనుగోళ్ల టోకెన్ల ఇస్తున్నారని తెలుసుకున్న మండల రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూకట్టారు. టోకెన్లు తీసుకోవడానికి అధిక సంఖ్యలో రైతులు తరలి రావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఇద్దరు మహిళా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు రైతులకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సోయా పంట చేతికి వచ్చి నెలలు గడిచినా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో 30 శాతం రైతులు తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్మి నష్టపోయారు.
మిర్జాపూర్ సహకార సంఘం వద్ద హడావుడి
సోయా కొనుగోళ్ల కూపన్‌లు ఇస్తుండడంతో నిర్మల్ జిల్లా, మిర్జాపూర్ సహకార సంఘం వద్ద రైతులు శనివారం వేకువజామున నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. సోయా పంటను విక్రయించుకోవడానికి టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలపడంతో ఉదయం నుండే రైతులు పట్టా పాస్ పుస్తకం చేత పట్టుకొని ఎంతకష్టమైనా క్యూలైన్‌లో నిల్చొని టోకెన్‌లను తీసుకెళ్లారు.
-
Home
-
Menu
