ప్రజా పాలన ఫలితం జూబ్లీ విజయం: మంత్రి అడ్లూరి

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రెండేళ్ల ప్రజా పాలన ఫలితమే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ విజయమని తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం నాడు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ సంబరాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బాణాసంచ పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పై విశ్వాసం నమ్మకంతో ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగింటిని అమలు చేసిందని వాటి ఫలితమే ఈనాటి విజయానికి కారణమని లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ఆదర్శంగా తీసుకొని మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని లక్ష్మణ్ కుమార్ చెప్పారు.
తమ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని బి ఆర్ ఎస్, బిజెపి ఎన్ని అబద్ధాలు ఆడిన దొంగ మాటలు చెప్పిన ప్రజలు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేశారని ఇప్పటికైనా వక్రబుద్ధి మానుకోవాలని సూచించారు. కేటీఆర్, హరీష్ రావు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టారని నీతి నిజాయితీకి పట్టం కట్టారని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వచ్చే 20 ఏళ్లు తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడియా రూప్లనాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కిలవనపర్తి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యక్షులు సంతోష్, యువజన కాంగ్రెస్ ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు యశోద అజయ్, ధర్మారం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోగాల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొల్లి స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జనగామ తిరుపతి,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
