కాంగ్రెస్ సీనియర్లకే సిఎం వార్నింగ్: బండి సంజయ్

ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ సిఎం సీట్లోకి వచ్చానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చైతన్యపురిలోని తన నివాసంలో మీడియాతో,స్థా నిక నేతలతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులున్నారని, వాళ్లందరినీ తొక్కుకుంటూ వెళ్లి సిఎం పదవి తెచ్చుకున్నాడని అన్నారు. ఈ మధ్య కొంతమంది సీనియర్లు అసమ్మతి మీటింగ్‌లు పెడుతున్నారన్నారు.
వాళ్లను ఉద్దేశించే సిఎం ఆ వార్నింగ్ ఇచ్చినట్లుందని పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వది స్తే గెలిచి సిఎం పదవిలోకి వచ్చానని చెబితే అందరూ హర్షిస్తారే తప్ప తొక్కుకుంటూ పదవుల్లోకి వస్తామనడం ఏంటో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ సైతం రేవంత్ రెడ్డిపైనే ఆధారపడి ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను అప్పగించారన్నారు. ఆ ఎన్నికల్లో సర్వేల దగ్గర నుండి పైసలు సమకూర్చే వరకు అన్ని బాధ్యతలు రేవంత్‌రెడ్డికే అప్పగించారని, ఇదే విషయంపై ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని చెప్పారు. సిఎం వాడుతున్న భాషను చూసి జనం అసహ్యిం చుకుం టున్నారని విమర్శించారు.
మజ్లిస్ ఎమ్మెల్యేలు బహిష్కరించడం దుర్మార్గం : వందేమాతరం గేయ ఆలాపన సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్, మండలి చైర్మన్, స్పీకర్, సిఎం, మంత్రుల సమక్షంలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలు బహిష్కరించడం దుర్మార్గం అన్నారు. శాసనసభలో సభ్యులు తప్పు చేస్తే శిక్షించే అధికారం ఒక్క స్పీకర్‌కు మాత్రమే ఉందన్నారు. ఎందుకంటే స్పీకర్ శాసనసభ కస్టోడియన్,అయినా ఇంత వరకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ ఇచ్చిన తీర్పుపట్ల ప్రజల్లో చులకన భావన ఏర్పడిందని, ఈ తరుణంలో వందేమాతరం ఆలాప నను మజ్లిస్ బహిష్కరిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
సిఎం ఎందుకు స్పందించలేదు? : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాననసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు స్పందిం లేదు? బీజేపీ అధికారంలో ఉండి ఉంటే ఎంఐఎం మెడలు పట్టి తప్పనిసరిగా వందేమాతరం ఆలపించేలా చర్యలు తీసుకునేవాళ్లం అన్నారు. మజ్లిస్ మోచేతి నీళ్లు తాగే పార్టీలు అధికారం లో ఉన్నవి కాబట్టే స్పందించడం లేదని మండిపడ్డారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మ జ్లిస్ పార్టీకి గుణం పాఠం చెప్పాలన్నారు అంతేగాదు, బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం నేతలు పడుకున్నా వందేమాతరం గుర్తుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. ఒవైసీ అప్పడప్పుడు వచ్చి దేశభక్తుడిని అని చెప్పుకోవడం కాదు,ఆచరణలో చూపాలి. అయి నా ఉగ్రవాదులను తన కాలేజీలో పెట్టుకుని దేశభక్తి మాట్లాడే ఒవైసీ మాటలను నమ్మేదెవరని ప్రశ్నించారు.
రైతు భరోసా ఎందుకుఅమలు చేయడం లేదు? : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏం చేస్తోంది?రైతు భరోసా పథకాన్ని ఎందుకు సం పూర్ణంగా అమలు చేయడం లేదు? రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు ఇస్తానన్నారు ఏమైంది? వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తానని ఎందుకు మోసం చేశా రన్నారు. జూన్ తో కలిపితే 6 వాయి దాలు(3 ఏళ్లు) కలిపి 58 వేల 500 కోట్ల సొమ్మను రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 17 వేల కోట్లు మాత్రమే జమ చేసింది. అంటే ఇంకా 41 వేల కోట్లు రైతులకు బాకీ ఉందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏకు అనుకూల ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. త మిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అన్నారు. కేరళలో శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించబోతున్నామన్నారు.
27 మంది ఓబీసీలకు మంత్రి పదవులిచ్చిన ఘనత బీజేపీదే : బీసీని ప్రధాని చేయడంతోపాటు 27 మంది ఓబీసీలకు మంత్రి పదవులిచ్చిన ఘనత బీజేపీదే అన్నారు. 12 మంది ఎస్సీలను, 7గురు ఎస్టీలను కేంద్ర మంత్రులుగా నియమించిన ఘనత బీజేపీదే. అంతేకాదు ఎస్టీ ఆదివాసీ మహిళకు, మైనారిటీ రాష్ట్రపతిగా అవకాశమిచ్చిన పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు.
-
Home
-
Menu
