మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి:మంత్రి జూపల్లి

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంసృ్కతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లాలోని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ నిఖిల, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో లక్ష చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని 100 శాతం సబ్సిడీతో అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన చేప పిల్లల పంపిణీ ప్రారంభమైందని మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు తెలిపారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం
చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. వంద శాతం సబ్సిడీతో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అన్నారు. మత్స్యకారులు అలవి వలలను ఉపయోగించరాదని మంత్రి హెచ్చరించారు. అలవి వలలతో చిన్న చేప పిల్లలు పడిపోవడం వలన మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలుగుతోందని, అటువంటి చర్యలకు కఠిన శిక్షలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. చేప పిల్లల సైజు బాగుండేలా, నాణ్యమైన చేప పిల్లలనే మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
