తప్పుడు ప్రచారంతో టిఆర్‌ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారింది:మంత్రి సీతక్క

Minister Seethakka Slams KTR
X

Minister Seethakka Slams KTR 

తప్పుడు ప్రచారంతో టిఆర్‌ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైతే హరీష్ రావు ఓర్చుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, గోబెల్స్ సమ్మిట్ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా సమాధానం చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే సహించలేకపోతున్నారని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని తెలంగాణ ఆగం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కెసిఆర్ కుటుంబమే గొప్పదన్న అహంకారంతో హరీష్ రావు మాట్లాడుతూ విజనరీ ఉన్న నేతలను చులకన చేసి మాట్లాడటం హరీష్ రావు నైజమని మండిపడ్డారు. ఖరీదైన భూములను పప్పు బెల్లాలకు అమ్ముకున్న చరిత్ర బిఆర్‌ఎస్ పెద్దలదని ఆరోపించారు.

గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ దేశ విదేశా కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు వేల కొలది ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయని చెప్పారు. నిరుద్యోగులను సొంత అవసరాలకు వాడుకొని కేసీఆర్ కుటుంబం వదిలేసిందని అన్నారు. అయితే తమ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ కల్పన చేస్తున్నామని చెప్పారు. దావోస్ సమ్మిట్ ను వినడమే కానీ నేను చూడలేదని, భారత్ ఫ్యూచర్ సిటీలో దావోస్ సమ్మిట్‌కు మించి ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని మంత్రి సీతక్క వివరించారు.

Tags

Next Story