మేడారంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన మంత్రి సీతక్క

మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ మంత్రి దనసరి అనసూయ పిలుపునిచ్చారు. గతంలో కాలినడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు.. ప్రస్తుతం ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్‌పై రావడానికి సిద్ధమవుతున్నారన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థ నిర్వహించనున్న హెలికాప్టర్ సేవలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వృధాకాకుండా హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని, హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు,
మేడారం నుండి హనుమకొండ కు వెళ్లేందుకు అతి తక్కువ ధరలలో ఒక్కొక్కరికి 31 వేల రూపాయల టికెట్ నిర్ణయించిందన్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్‌ద్వారా పర్యటించడానికి 4 వేల 8 వందల రూపాయల టికెట్‌ను ఖరారు చేశారని వివరించారు. గతంలో మహా జాతర సందర్భంగా అప్పటి పాలకులు నామమాత్రంగా నిధులు కేటాయించగా ప్రజాప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ పనులతోపాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 251 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. గురువారం నుండి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపారు. థంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వీస్ నిర్వహిస్తుంది. బుకింగ్ కొరకు మొబైల్ నెంబర్ 9676320139, 8530004309, 7660939509 వెబ్‌సైట్ డబ్లుడబ్లుడబ్లు
. హెలితాక్సియ్.కామ్‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈద్గా ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క.... జిల్లా కేంద్రంలోని ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి సుమారు రూ.15 లక్షలతో నిర్మించిన ఈద్గా ప్లాట్ ఫామ్ మంత్రి సీతక్క ప్రారంభించారు. ముస్లిం మైనారిటీల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మైనారిటీల కోసం మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ప్రజా ప్రతినిధులు, మైనార్టీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
