మతాల పేరుతో రెచ్చగొడుతున్న బిజెపి: మంత్రి సీతక్క

మతాల పేరుతో రెచ్చగొడుతున్న బిజెపి: మంత్రి సీతక్క
X

కులమతాల పేరుతో భారతీయ జనతాపార్టీ ప్రజలను రెచ్చగొడుతుందని రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గేను బీజేపీ అవమానించడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సత్యాగ్రహ ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్‌లో రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన ప్రాంతాన్ని బీజేపీ నాయకులు శ్రీరామ్ సేవ పేరుతో శుద్ధి చేసి బీజేపీ దురంహకారం ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు. కుల, మతాల పేరుతో అవమానించడం, దేవుళ్ల పేరుతో ఓట్లు అడగడం శ్రీరాముని సిద్ధాంతం కాదన్నారు.52 ఏండ్లు జాతీయ జెండాను ఎగుగరవేయకుండా అవమానించి, జాతీయ జెండా పట్టని ఆర్‌ఎస్‌ఎస్,

బీజేపీ నేతలు గ్రామాలలో తిరుగుతూ తిరంగా జెండా ఎగురవేయడం విడ్డూరమన్నారు. బీజేపీ నాయకులు జాతీయ జెండా రక్షకులమని చెప్పుకొంటున్నారన్నారు. దేశం కోసం ఒంటి మీద అంగీ లేకుండా స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీపై, నెహ్రూను చంపిన ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం మిఠాయిలు పంచుకొని జాతి కోసం, జెండా కోసం మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దళిత బిడ్డ ప్రసంగించిన ప్రదేశాన్ని శుద్ధి చేయడం పట్ల సమాజానికి సమాధానం చెప్పాలన్నారు. మోదీ, అమిత్ షా వెంటనే భేషరతుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. యువత బీజేపీ నాయకులను ప్రశ్నించాలి, అన్ని మతాలు, వర్గాలు, కులాలు భారతదేశంలో కలిసి ఉన్న ప్రాంతాలలో కులాల, మతాల పేరుతో విభేదాలు సృష్టించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు, యువత మతోన్మాదులను ప్రశ్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా అధికార ప్రతినిధి చింతనిప్పుల భిక్షపతి, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Tags

Next Story