మా పాలనను చూసి గెలిపించారు.. అక్బరుద్ధీన్ కు శ్రీధర్‌బాబు కౌంటర్

X
కార్యకర్తలు రేయింబవళ్లు కష్టపడితేనే జూబ్లీహిల్స్‌లో విజయం దక్కింది
తామే గెలిపించామని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమే
అక్బరుద్ధీన్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో తమ మద్దతుతో కాంగ్రెస్ గెలిచిందన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి జనం ఓట్లు వేశారని, తమ వల్లే గెలిచిందని ఎవరైనా చెప్పుకుంటే.. అది వారి భ్రమేనని అన్నారు. మా పాలనను చూసి జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేశారని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో మేం ఎవరి వల్లనో గెలవలేదు.. కాంగ్రెస్ బలంతోనే గెలిచాం.. మా పార్టీ నేతలు రేయింబవళ్లు కష్టపడితేనే విజయం దక్కిందని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.
Next Story
-
Home
-
Menu
