చివరి గింజ వరకూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్

చివరి గింజ వరకూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్
X

ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో చివరి గింజ వరకు మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం పెద్దపల్లి ఐడిఓసీలో నిర్వహించిన యాసంగి ధాన్యం కొనుగోళ్ల సమీక్ష సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తి మద్దతు ధరతోనే కొనుగోలు చేస్తామని,ఇసుక రవాణా వాహనాలను ధాన్యం కొనుగోలుకు వినియోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డిఫాల్ట్ రైస్ మిల్లులు బకాయిలు చెల్లిస్తే ధాన్యం కేటాయింపు జరుగుతుందని,మే నెలాఖరులోగా యాసంగి కొనుగోళ్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.

Tags

Next Story