కెసిఆర్ రాజ్యాంగం ముగిసింది: మంత్రి వాకిటి

కెసిఆర్ రాజ్యాంగం ముగిసింది: మంత్రి వాకిటి
X

బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగం ముగిసిందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జోస్యం చెప్పారు. కెసిఆర్‌కు నిబద్ధత, నిజాయితీ ఉంటే కడిగిన ముత్యంలా బయటకు రావాలని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని కె. కవిత ఆరోపించారని ఆయన తెలిపారు. ధరణి పెట్టి భూములు, రియల్ ఎస్టేట్ వ్యవస్థను ఆగమాగం చేసింది మీరు కాదా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ, లోక్‌సభ, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పినా, ఆ పార్టీ నాయకులు మారలేదని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయమేమీ కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ దేశంలోనే అత్యంత దుర్మార్గమైన చర్య అని ఈ చర్య వల్ల తెలంగాణ ప్రతిష్ట దేశవ్యాప్తంగా దిగజారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల ఫఓన్లు, వ్యాపారుల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, సినీ నటుల ఫోన్లు, చివరకు భార్య-భర్తల ఫోన్లూ ట్యాప్ చేయడం నీచమైన చర్య అని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. బిఆర్‌ఎస్ గెలిచి ఉంటే ఇప్పటికీ ఫోన్ల ట్యాపింగ్‌లు కొనసాగేవని ఆయన తెలిపారు

Tags

Next Story