మహిళతో మీర్ చౌక్ ఎసిపి అసభ్య ప్రవర్తన?

X
హైదరాబాద్: పాత బస్తీలోని మీర్ చౌక్ ఎసిపిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఎసిపి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నడంటూ ఓ మహిళ వీడియో విడుదల చేసింది. ఇంటి ముందు కారు పెట్టి ఓ వ్యక్తి వేధిస్తున్నాడని మిర్ చౌక్ పోలీసులకు దళిత మహిళ జూన్ లో ఫిర్యాదు చేసింది. అప్పుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని మిర్ చౌక్ ఎసిపిని బాధితురాలు కలిసింది. కానీ తనకు ఎసిపి అసభ్య మెసేజీలు పెట్టడంతో పాటు ఫోన్ లో వేధిస్తున్నాడని బాధితురాలు వీడియో విడుదల చేసింది. ఒంటరిగా రావాలని, తనతో గడపాలని, చెప్పినట్టు వింటేనే న్యాయం చేస్తానని మహిళాతో ఎసిపి ఫోన్ లో మాట్లాడినట్టు ఆరోపణలు చేసింది. మిర్ చౌక్ పోలీసులతో బాధితురాలికి ఫోన్ చేయించి ఒత్తిడి చేస్తున్నట్లు వీడియోలో మహిళా ప్రస్తావించింది.
Next Story
-
Home
-
Menu
