మియాపూర్ లో అగ్నిప్రమాదం

మియాపూర్ లో అగ్నిప్రమాదం
X

మియాపూర్: రంగారెడ్డి జిల్లా శేర్ లింగంపల్లి మండలం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ హఫీజ్‌పేట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హఫీజ్‌పేట్‌లో ఉన్న ఓ పెయింట్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న మరో రెండు భవనాలకు కూడా అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో కోటి రూపాయలు వరకు ఆస్తి నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Next Story