రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట: ఎంఎల్ఎ కడియం శ్రీహరి

వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద పీట వేస్తుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలంలో ఖిలాషాపూర్, జాఫర్‌గూడెం, మంగల్‌తండా, వెల్ది గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు చూడాలన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తడవకుండా సరిపడే టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎవరికీ ఒక్క పైసా ఇవ్వకూడదన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల వద్దకు వెళ్లి నష్టపోవద్దన్నారు. ఏ గ్రేడ్ రకానికి ధాన్యానికి క్వింటాళుకు రూ. 2389, గ్రేడ్. 2కు 2369 మద్దతు ధరతోపాటు ప్రతీ క్వింటాళు సన్న ధాన్యానికి రూ. 500 రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు పక్షపాతి అని దేశంలోనే ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అమలుచేస్తుందన్నారు. 20 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలుచేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ. 1075 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తానని, కొంత మంది నాయకులు పని పాటా లేక ప్రెస్ మీట్లను ఏర్పాటుచేసి అక్కరకు రాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. అనంతరం రఘునాథపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో వనిత టీ స్టాల్, ఇందిరమ్మ నమూనా ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపెల్లి లింగాజీ, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా డ్వామా పీడీ జనగామ ఆర్డీవో గోపిరామ్, తహసీల్దారు ఫణికిషోర్, మండల కాంగ్రెస్ అద్యక్షుడు కోళ్ల రవిగౌడ్, మేకల నరేందర్ వరలక్ష్మి, గాద మహేందర్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఎండీ భాషుమియా, తోటకూర రమేశ్, పర్శ సిద్దేశ్వర్, లోనె శ్రవణ్‌కుమార్, మంద రమేశ్, హుస్సేన్ నాయక్, కావటి భాస్కర్, అలీ బిల్ నర్సయ్య, ఈశ్వరయ్య, రేణుగౌడ్, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
