లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి భారత్ ఎదిగింది: మోడీ

ఢిల్లీ: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ లో ఆత్మనిర్భర్ భారత్ కు కీలక కేటాయింపులు జరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర బడ్జెట్ పై మోడీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ ద్రవ్యలోటును నియంత్రిస్తుందని, కేంద్ర బడ్జెట్ భవిష్యత్ కు రోడ్ మ్యాప్ గా నిలుస్తుందని తెలియజేశారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని మోడీ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లో మరింత ఊతమని, లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి భారత్ ఎదిగిందని కొనియాడారు. యువశక్తిని ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్ అని..యువతకు గేమింగ్, టూరిజం, క్రీడా సౌకర్యాలు ఉంటాయని అన్నారు. వికసిత్ భారత్ ప్రయాణం వేగవంతానికి బడ్జెట్ తోడ్పాటు చేస్తుందని, భారత్ ప్రయోజనాల కోసం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ జరుగుతుందని చెప్పారు. భారత్ ను డేటా సెంటర్ హబ్ గా మార్చేందుకు ట్యాక్స్ హాలిడే అని..ఉద్యోగాల కల్పనకు బడ్జెట్ మరింత దోహదపడుతుందని మోడీ స్పష్టం చేశారు.
-
Home
-
Menu
