మద్యం షాపులోకి కోతి.. బాటిల్ ఖాళీ చేసి అక్కడే నిద్ర

మద్యం షాపులో కోతి హంగామా.. తాగి అక్కడే మకాం
రాంచీ: సాధారణంగా కోతులు ఆహారం కోసం ఇళ్లలోకి, దుకాణాల్లోకి రావడం చూస్తుంటాం. కానీ జార్ఖండ్‌లోని రాంచీలో ఓ కోతి చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏకంగా మద్యం దుకాణంలోకి వెళ్లి.. అక్కడి బాటిల్‌లోని మద్యం తాగి.. చివరకు దుకాణంలోనే హాయిగా నిద్రపోయింది. ఒర్మాంజీ ప్రాంతంలోని బ్లాక్ చౌక్ వద్ద అకస్మాత్తుగా మద్యం దుకాణంలోకి ప్రవేశించిన ఆడ కోతి కొద్దిసేపు అక్కడ అటూ ఇటూ తిరిగింది. అనంతరం దుకాణంలో ఉన్న మద్యం బాటిల్ నుంచి కొంత మద్యం తాగింది. అనంతరం కోతి దుకాణం లోపలే పడుకుని నిద్రపోయింది. దీంతో దుకాణ సిబ్బందికి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆసక్తిగా అక్కడికి చేరుకుని వింత దృశ్యాన్ని చూశారు. స్థానికుల సమాచారం మేరకు రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కోతికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా దానిని దుకాణం నుంచి బయటకు తరిమేశారు.
Tags
-
Home
-
Menu
