తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. భక్తులు16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నారు. శనివారం శ్రీవారిని 91,147 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.31 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలోకి రావడం జరిగింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు విచ్చేసే భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసిన‌ట్లు టిటిడి అద‌న‌పు ఇఒ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తెలిపారు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న తిరుమ‌ల‌లోని శిలా తోర‌ణం వ‌ద్ద నుండి ద‌ర్శ‌న క్యూలైన్ల‌ల‌ను అధికారుల‌తో క‌లిసి త‌నిఖీ చేశారు.

Tags

Next Story