సూర్యాపేటలో దంపతులను చంపిన కానిస్టేబుల్... సంచలన నిజాలు వెలుగులోకి

సూర్యాపేటలో దంపతులను చంపిన కానిస్టేబుల్... సంచలన నిజాలు వెలుగులోకి
X

24 గంటల్లో ఛేదించిన పేట పోలీసులు

ఇద్దరు అరెస్ట్, రిమాండ్‌కి తరలింపు

ఎస్పీ నరసింహ

మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భార్య భర్తల జంట హత్యల కేసుకు సంబంధించి నేరానికి పాల్పడ్డ వారిని 24 గంటల్లోనే గుర్తించి అరెస్టు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. మోతే మండల కేంద్రం జాతీయ రహదారి పక్కన మృతిదేహాలను పాక్షికంగా పూడ్చిపెట్టారని గురువారం ఉదయం స్థానికుల ద్వారా సమాచారం అందుకు న్న వెంటనే కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, స్థానిక ఎస్‌ఐ లచ్చి రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక గ్రామ అధికారితో కలిసి మృతి దేహాలను వెలికి తీసారని, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామకృష్ణా రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని, అందుబాటులో ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా రెండవ నిందితుడైన జిల్లేపల్లి సుందర్ మృతిచెందిన బూబా ను తీసుకెళుతూ అనామస్పదంగా కనిపించాడని, దీని ఆధారంగా దర్యాప్తు చేస్తున్న మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక బృందం శనివారం ఉదయం 8 గంటల సమయంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద మొదటి నిందితుడు షరీఫ్ ను, రెండవ నిందితుడు సుందర్ లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

వారిని విచారించగా నే రాన్ని అంగీకరించినట్లు తెలిపారు. మోతే గ్రామానికి చెందిన సుందర్ పోలీసు స్టేషన్ కు వచ్చే పంచాయతీలు చేస్తూ మొదటి నిందితుడు షరీఫ్ కు పరిచయం అయ్యాడు. సుందర్ ద్వారా హ త్యకు గురైన నాగులు, బూబా భార్యాభర్తలు షరీఫ్ కు పరిచయం అయ్యారు. ఈ పరిచయం సాన్నిహిత్యం ఏర్పడిందని, బూబా, నాగులు దంపతులకు షెరీఫ్ 3 లక్షల రూపాయలు ఇచ్చాడని, ఈ డబ్బులు అడిగే క్రమంలో భూబా, నాగులు దంపతులు షరీఫ్ ను బెదిరించగా వీరి అడ్డు తప్పించుకోవాలని పథకం పన్ని రెండవ నిందితుడు సు ందర్ సహాయంతో హత్య చేసి పాతి పెట్టినట్లు తెలిపారు. మృతులు మోతే మండలం బిక్యతండా కు చెందిన హలావత్ నాగులు అతని భార్య హలవత్ బూబా వలస వచ్చి ప్రస్తుతం మోతే గ్రామం లో వ్యవసాయ భూమి కౌలు తీసుకొని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు.

ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. వారికి పెళ్లిళ్లు అయినాయి. మోతే గ్రామానికి చెందిన జిల్లేపల్లి సుందర్ అను వ్యక్తి కి స్టేషన్ కానిస్టేబుల్ అయిన ఎండి షరీఫ్ కు అతని తో పరిచయం ఏర్పడింది. బూబా నాగులు లు మోతే లోనే నివాసం ఉండటం తో వాళ్ళ బిడ్డ, భార్య భర్త ల పంచాయితిలో పోలీస్ స్టేషన్ కు రావటంతో షరీఫ్ కు , బూబా నాగులు లకు పరిచయం అయింది. అల్లుడు డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నాడని, డబ్బులు సమకూర్చాలని బూబా- నాగులు ల అబ్యర్ధన మేరకు షరీఫ్ సుమారు 3 లక్షల రూ.లు బూబా నాగులు లకు ఇవ్వటం జరిగింది. తిరిగి ఇచ్చే క్రమంలో బూబా నాగులు లు డబ్బులు ఇవ్వకుండా, తిరిగి షరీఫ్ ను ఎట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తూ ఉండటం తో ఎలాగైనా వారి ఇద్దరినీ చంపేయాలని షరీఫ్ నిర్ణయించుకున్నాడు. వారికి గొర్రెల లోన్ గూర్చి చెప్పి లోన్ కొరకు వారికి కొన్ని గొర్రెలు ఉన్నట్లు నమ్మించాలని, చెకింగ్ కోసం వచ్చినపుడు గొర్రెలు చూపించాలని, వాటి కోసం గొర్రెలు ఉన్న వారి ని బ్రతిమిలాడి, గొర్రెల షెడ్డులో కాకుండా గ్రామ శివారులో ఉండి వాటికి నీటి వసతి, గొర్రెల ఎరువు వేయటానికి ఒక గుంత ఉండాలని వారిని నమ్మించి, తాను అనుకున్న ప్లాన్ ను సుందర్ కు చెప్పగా తాను సరే అనటం తో ఇద్దరు కలిసి 11వ తేదీ రాత్రి మోతే లో కలిసి ఒక పధకం ప్రకారం, ముందుగా షరీఫ్, సుందర్ లు తన మోటార్ సైకిల్ పై నాగులు ను బైక్ మీద ఎక్కించుకొని మోతే గ్రామ శివారు జాతీయ రహదారి 365 ఫ్లై ఓవర్ కు సుమారు 200 మీటర్ ల దూరంలో కమ్మ శ్రీనివాస్ కు చెందిన భూమి వద్ద కు తీసుకెళ్లి నాగులు తో గుంత తీయించే క్రమంలో వెనక నుండి గుద బండ తో బలంగా తల పై మోదటం తో అదే గుంత లో నాగులు పడిపోగా అతను చనిపోయాడని నిర్దారించుకొని షరీఫ్, సుందర్ లు శవాన్ని పూడ్చి అక్కడి నుండి వెళ్ళిపోయరని, కొంత సేపటి తర్వాత బూబా ను ఫోటో దిగాలని చెప్పి అదే బైక్ పై అదే ప్రదేశానికి నమ్మించి తీసుకెళ్లి ఆమెను కూడా హతమార్చి గుంత తీసి, పాతి పెట్టె క్రమంలో మహిళా ఒంటి పై ఉన్న ఆభరణ లు కూడా తీసుకీళ్లారని తెలిపారు.

దర్యాప్తు లో భాగంగా సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు స్థానికుల సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి సూర్యాపేట కొత్తగా బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు లో పారధర్శకత కోసం కేసు ను సూర్యాపేట్ డిఎస్‌పి ప్రసన్న కుమార్ కి అప్పగించగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎండి షరీఫ్ (పోలీస్ కానిస్టేబుల్, మోతే పి.యస్ ) మరియు జిల్లేపల్లి సుందర్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన గుద బండ, బైక్ , రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించటం జరుగుతుందన్నారు. ఈ కేసులో బాగా పని చేసిన కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, అధికారి సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, స్థానిక ఎస్సై లచ్చిరెడ్డి, సిసిఎస్ ఎస్‌ఐలు సాయిరాం, హరికృష్ణ, సిసిఎస్ సిబ్బంది అందరికీ రివాడ్స్ అందించి అభినందించడం జరిగింది.

Tags

Next Story