కల్వకుర్తిలో విషాదం

భర్త మృతిని తట్టుకోలేక ఒక కుటుంబం మాకుమ్మడిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ క ర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో బుక్ సెంటర్ నిర్వహిస్తున్న భీంశెట్టి ప్రకాష్ (47) గత నెల రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య భీంశెట్టి ప్రసన్న (38) గురువారం మధ్యహ్నం ఇద్దరు పిల్లలు కూతురు మేఘన (13) కుమారుడు అశ్రీత్ రాం (15) కు అన్నంలో విషం కలిపి పిల్లలకు తినిపించి ఆమె కూడా తినేసింది. ఆమె తమ్ముడు ఇంటికి వచ్చి తలుపు తీయగా అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి హుటా హుటినా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి తల్లి కూతురు మృతి చెందారు. కుమారుడు అశ్రిత్ రామ్ చికిత్స పొందుతున్నాడు. అతనికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
