యాదాద్రిలో దారుణం..కుమార్తె, కుమారుడిని కత్తితో పొడిచిన తల్లి

X
హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో భువనగిరి మండలం తుక్కపురంలో దారుణం చోటు చేసుకుంది. తల్లికి మతి స్థిమితం లేక కుమార్తె, కుమారుడిని కత్తితో పొడిచింది. గత కొంతకాలంగా భర్త నరేంద్ర రెడ్డి, నీలిమ మధ్య గొడవలు జరుగుతున్నాయి. పుట్టింటి నుంచి వచ్చిన వెంటనే తన పిల్లలను హత్య చేయడానికి పాల్పడి.. తను ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. నీలిమ కత్తితో పొడవడంతో కుమార్తె కృతిక (14) మృతి చెందింది. కుమారుడు అశాంత్ రెడ్డి(11)కి గాయాలయ్యాయి. తల్లి దాడి నుంచి కుమారుడు తప్పించుకున్నాడు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నీలిమ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
