ట్రిబుల్ ఆర్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: ఎంపీ చామల

ట్రిబుల్ ఆర్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: ఎంపీ చామల
X

దేశంలోనే మొదటి అవుటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ చుట్టూర సుమారు నాలుగు వందల కిలో మీటర్లు విస్తరించి సుమారు ఎనిమిది జిల్లాలను, పద్నాలుగు మండలాల్లో ట్రిబుల్ ఆర్ వస్తుందన్నారు. ఇందులో దాదాపు ఐదు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే ప్లై వోవర్లు ఉన్నాయని, వీటి అంచనా వ్యయం సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలని ఆయన వివరించారు. రాబోయే అవుటర్ రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తుందని ఆయన తెలిపారు. ఉత్తర భాగం, దక్షిణ భాగం సర్వే పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు.

హైదరాబాద్ ప్రాముఖ్యత, అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఆయన తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఆవిష్కరణ, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించిందని, ఇది దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థకు, దేశపు ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్షానికి మరింత దోహదపడడమే కాకుండా వికసిత్ భారత్ యొక్క థీమ్, లక్షాన్ని సాధించడంలో కూడా సహాయపడుతుందన్నారు. ఈ రింగ్ రైల్ ప్రాజెక్టు ఆర్థిక కార్యకలాపాలను, ఐటి హబ్‌లను, ఫార్మాస్యూటికల్ క్లస్టర్లను లాజిస్టిక్ పార్కులు, అభివృద్ధి చెందుతున్న పట్టణ వృద్ధి కేంద్రాలను సృష్టిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వృద్ధి కారిడార్‌లను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుందని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

Tags

Next Story