కెసిఆర్ తెలంగాణ జాతిపిత కాదు: ఎంపి చామల

MP Chamala kiran kumar reddy fire on KTR
X

MP Chamala kiran kumar reddy fire on KTR

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ మఖ్యమంత్రి కెసిఆర్ జాతిపిత కాదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం అంటూ లబోదిబోమంటున్నారని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఫోన్ ట్యాటింగ్ ఆధారాలు లేకుండా చేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరులను విస్మరించినప్పుడు కెసిఆర్‌కు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా గాయకుడు గద్దర్‌ను, మీ ప్రభుత్వ హయాంలో హోం మంత్రిగా ఉన్న మహమూద్ అలీని ప్రగతి భవన్ గేటు బయటి నుంచే వెనక్కి పంపించినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అరాచక పాలన చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆరోపించారని, దానికి సమాధానం ఇవ్వడం లేదన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల హక్కులు హరించబడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Tags

Next Story