కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం: ఎంపి మల్లు రవి

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం: ఎంపి మల్లు రవి
X

కేంద్ర బడ్జెట్ నిరాశజనక బడ్టెట్ అని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి అభివర్ణించారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలను పూర్తి నిరాశకు గురి చేసిందన్నారు. ముఖ్యమంత్రి,మంత్రులు చేసిన విజ్ఞప్తులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ,జాతీయ ప్రాజెక్టులు, హైదరాబాద్ మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని కోరినా అవి ఏవీ ఇవ్వకపోగా, హైదరాబాద్ మెట్రో గురించి ప్రస్తావన లేనే లేదన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై బడ్జెట్‌లో మాట్లాడతారని, ప్రస్తుత భారతను గాలికి వదిలేసి 2047 ఫోకస్ చేస్తూ.. ఇప్పుడున్న సమస్యలను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉందని, నిరుద్యోగ సమస్యను గుర్తించకపోవ డం అన్యాయం కాక మరేమిటి? అని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా 22 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, 2014 నుంచి కార్పొరేట్ సంస్థలకు అనుకూల బడ్జెట్ ఇస్తున్నారని తెలిపారు.

వృద్ధి రేటుకు అర్థం ఉండదని, సామాన్య ప్రజలకు ఉపయోగం లేకుండా ఉండే వృద్ధి రేటు ఉందని.. ఉన్నవారు లేని వారికి మధ్య అంతరం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సమానత్వాన్ని బిజెపి మర్చిపోయిందని విమర్శిం చారు. ఉపాధి హామీకి నిధులు పెంచారు అంటున్నారు కానీ అవి బడ్జెట్‌లో కనిపించడం లేదన్నారు. అదే విధంగా నిరుద్యోగం, నిత్యావసర ధరలు పెరగడం వల్ల పక్క దేశాల్లో యువత ఆందోళనలు చేస్తున్నాయని గుర్తు చేశారు. నిత్యవసర ధరలు తగ్గించడం లేదని, ఇది పేదలకు వ్యతి రేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలనేది రైతుల ప్రధాన డిమాండ్, దాని గురించి కూడా ప్రస్తావించలేదన్నా రు. ప్రధాన పంటలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదని, పంట నష్టం ఇన్‌పుట్ సబ్సిడీ గురించి మాట్లాడలేదని, దేశవ్యాప్తంగా ఉన్న నిరు ద్యోగం, పట్టణ ఉపాధి కల్పన, పంటలకు చట్టబద్దత గురించి మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.

బ్రిటిష్ వారు ఉన్నపుడు పెట్టేలా ప్రస్తుత బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరురంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ లేదన్నారు. మూసి ప్రక్షాళన కు నిధులు ఇవ్వలేదని, గంగ నదికి,యమునా నదికి నిధులు ఇస్తారని, మూసి నదికి ఇవ్వడం లేదని, తెలంగాణకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు అమలు చేయాలని, తెలంగాణ వాటా నిధులు విడుదల చేయాలని, తెలంగాణ బిజెపి ఎంపిలు ప్రధాని ఆర్థిక మంత్రితో మాట్లాడి, తెలంగాణ అవసరాలు తీర్చడానికి పనిచేయాలని సూచించా రు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పార్లమెంటు లోపల బయట పోరాడుతామని ఎంపి మల్లు రవి వెల్లడించారు.

Tags

Next Story