సిఎం రేవంత్ కుట్ర పన్ని బీఆర్‌ఎస్‌ని అవమానపరిచారు: ఎంపి వద్దిరాజు రవిచంద్ర

సిఎం రేవంత్ కుట్ర పన్ని ఒక దుర్బుద్ధితో బీఆర్‌ఎస్ పార్టీని అవమానపరిచారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం దేవరుప్పుల మండలకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితతో కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తొర్రురు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడుగురు అభ్యర్థులు గెలిస్తే బీఆర్‌ఎస్ తొమ్మిది మంది అభ్యర్థులు గెలిచారని, ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని దుర్మార్గమైన ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు బయటపడ్డాయని, ఎక్స్‌ఆఫీషియో ఓటు ఎమ్మెల్యేకు ఉన్నా ఎంపీ కడియం కావ్యకు లేదని, వరంగల్ లో ఓటు నమోదు చేసుకుందని, కానీ సిఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా తొర్రురు మున్సిపాలిటీ ఎలాగైనా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని కడియం కావ్యను ఇక్కడికి రప్పించారన్నారు. ఒక దుర్బుద్ధితో బీఆర్‌ఎస్ పార్టీని అవమాన పరచిందని, కానీ వాస్తవంగా గెలిచింది బీఆర్‌ఎస్ పార్టీనేనని, ఎందుకంటే ఒక్కరూ కూడా దయాకర్ రావు మాటకు కట్టుబడి ఉండి బీఆర్‌ఎస్ పార్టీని వీడకుండా కార్యకర్తలందరూ పోరాడారన్నారు. కడియం కావ్య వరంగల్ లో ఆమెకు ఉన్న ఓటు తొర్రూలో ఎలా చెల్లుతుందో కోర్టు ద్వారానే తెలుసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకుని డ్రా చేసి గెలుచుకున్నారు.
కడియం కావ్య గెలిచిన తరువాత జీడబ్లూఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరయ్యారని, ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరులో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం అన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. తొర్రూరులో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నిక్కచ్చిగా ఉండడం మన మొదటి విజయం అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితం బుద్ధి చెప్తామన్నారు. తొర్రూరులో నిజంగా పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్‌ఎస్ పార్టీ గెలిచిందని, తొర్రూరులో గెలవాలని రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి కుట్రలు జరిపారాన్నరు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బీఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్, పాలకుర్తి మాజీ జెడ్పిటిసి శ్రీనివాసరావు, మండల బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు తీగల దయాకర్, చింత రవి, మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాంసింగ్, యూత్ అధ్యక్షుడు నవీన్, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
Home
-
Menu
