కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య

కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య
X

హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ విద్యార్థిని విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. క్యాంపస్‌లో చోరీ చేసినట్టు తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన పెద్దమళ్ల శ్రీవిద్య (22) ఎమ్మెస్సీ చదువుతుంది. శ్రీవిద్యపై ల్యాప్ టాప్, బంగారం చోరీ చేసిందంటూ క్యాంపస్‌లోని కొందరు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ నిందను భరించలేక ఈ నెల 8వ తేదీన స్వగ్రామం వెళ్లి ఇంట్లో ఎలుకలకు పెట్టే పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. చికిత్స పొందుతూ శ్రీవిద్య మృతి చెందింది. తమ కూతురు చోరీ చేయలేదని, సీనియర్లే కావాలని ఆరోపణలు చేసి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయడంతోనే శ్రీవిద్య ప్రాణాలు తీసుకుందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags

Next Story